సిసలైన మాస్ రూపం…”పుష్ప” నుండి ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” లిరికల్ వీడియో విడుదల!

Published on Nov 19, 2021 11:29 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన మొదటి భాగం డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పుష్ప ది రైజ్ పేరిట విడుదల కానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి తాజాగా నాల్గవ లిరికల్ వీడియో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా గా కనిపిస్తున్నారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ అద్బుతం గా ఉన్నాయి అని చెప్పాలి. ఈ లిరిక్స్ తో పుష్పరాజ్ పాత్ర పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో కొనసాగే ఈ చిత్రం లో అల్లు అర్జున్ మరింత మాస్ అండ్ పవర్ ఫుల్ గా కనిపించనున్నారు.

సుకుమార్, అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబో లో వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటి సమంత సైతం ఈ చిత్రం లో ప్రత్యేక గీతం లో ఆడి పాడనున్నారు. పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో విడుదల అవుతున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More