ఎఫ్ 2 లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Jan 20, 2019 12:48 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఎఫ్ 2 మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి సక్సెస్ ఫుల్ గా రెండవ వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ చిత్రం 8వ రోజు కూడా బాక్సాఫిస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా 8రోజుల్లో ఈచిత్రం 48కోట్ల షేర్ వసూళ్లను రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో 39.64 కోట్ల షేర్ ను రాబట్టి హావ కొనసాగిస్తోంది. ఈ రోజుతో ఈచిత్రం 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఇక ఈ చిత్రం ఫుల్ రన్ లో వెంకీ , వరుణ్ లకు కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ను అందించనుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఈ చిత్రం యొక్క 8రోజుల వసూళ్ల వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 13.34 కోట్లు
సీడెడ్ 5.22కోట్లు
ఉత్తరాంధ్ర 5.51 కోట్లు
తూర్పు గోదావరి 4.73కోట్లు
పశ్చిమ గోదావరి 2.63 కోట్లు
కృష్ణా 3.43 కోట్లు
గుంటూరు 3.49 కోట్లు
నెల్లూరు 1.29కోట్లు
మొత్తం  39.64 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More