ఎఫ్ 2,వివిఆర్ నైజాం కలెక్షన్స్ !

ఎఫ్ 2,వివిఆర్ నైజాం కలెక్షన్స్ !

Published on Jan 19, 2019 10:47 AM IST

విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ ల మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ జనవరి 12న విడుదలై బాక్సాఫిస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ చిత్రం నైజాం లో నిన్న 1.20కోట్ల షేర్ ను రాబట్టి వారానికి గాను ఆక్కడ 11.80కోట్ల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈచిత్రం నైజాం లో భారీ లాభాలను తెచ్చిపెట్టనుంది.

ఇక ఈచిత్రానికి ఒక్క రోజు ముందు విడుదలైన వినయ విధేయ రామ మాత్రం నిన్న నైజాం లో కేవలం 5లక్షల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. అయితే డిజాస్టర్ టాక్ ను సైతం తట్టుకొని 8రోజుల్లో నైజాం లో ఈచిత్రం 12.5కోట్ల షేర్ వసూళ్లను రాబట్టగలగడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాకుండా చాలా ఏరియాల్లో ఈచిత్రం బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు