సెన్సార్ చేయించుకున్న ‘ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌’ !

సెన్సార్ చేయించుకున్న ‘ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌’ !

Published on Jan 4, 2019 9:44 PM IST

F2

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధమైంది.

ఇక అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరించారట. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

తాజా వార్తలు