విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ‘ఎఫ్’ ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా 25రోజులను పూర్తి చేసుకుంది. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు 75 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం తాజాగా మరో రేర్ ఫీట్ ను సాధించింది. కృష్ణా జిల్లాలో 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన 6వ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ కథానాయికలుగా నటించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
కృష్ణా లో 5కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన చిత్రాలు :
బాహుబలి 2 – 14 కోట్లు
రంగస్థలం – 7కోట్లు
బాహుబలి – 6.86 కోట్లు
భరత్ అనే నేను – 5.80 కోట్లు
ఖైదీ నంబర్ 150 – 5.75 కోట్లు
ఎఫ్ 2 – 5 కోట్లు


