ఎఫ్ 2 ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

ఎఫ్ 2 ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

Published on Nov 4, 2018 11:22 AM IST

హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ . ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా నవంబర్ 5న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది.

కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తుండగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు