దీపావళి కి సప్ రైజ్ ఇవ్వనున్న ‘ఎఫ్2’ టీం !

దీపావళి కి సప్ రైజ్ ఇవ్వనున్న ‘ఎఫ్2’ టీం !

Published on Oct 30, 2018 5:57 PM IST

విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు 70 శాతంషూటింగ్ పూర్తి కానుంది. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. ఇక ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను దీపావళి రోజు నవంబర్ 7న విడుదల చేయనున్నారని సమాచారం.

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగా జనవరి 12న ఈ చిత్రంప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు