సోమవారం కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఎఫ్ 2 !

Published on Jan 22, 2019 11:07 am IST


విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా రెండవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక నిన్న వర్కింగ్ డే అయిన కూడా ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సోమవారం 2. 65కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక 10రోజులకుగాను ఈ చిత్రం తెలంగాణ &ఏపీల్లో 47కోట్ల షేర్ ను రాబట్టింది. రేపటి తో 50కోట్ల మార్క్ ను దాటడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే ఈ చిత్రం అటు యూఎస్ఏ లో 2 మిలియన్ క్లబ్ కు చేరువైయ్యింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ లో మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తమన్నా , మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More