బ్యాంకాక్ లో సందడి చేయనున్న’ఎఫ్ 2′ టీం !

బ్యాంకాక్ లో సందడి చేయనున్న’ఎఫ్ 2′ టీం !

Published on Aug 18, 2018 9:27 AM IST

సీనియర్ హీరో విక్టరీ ‘వెంకటేశ్‌ , మెగా హీరో వ‌రుణ్ తేజ్ ల కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌ . ఈచిత్రం ఇటీవల హైద్రాబాద్లో మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్ కు వెళ్లనుంది చిత్ర యూనిట్. 20 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్లో కిలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ఈచిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కుటుంభ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు