ఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Jan 6, 2019 5:52 pm IST

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ యొక్క ట్రైలర్ రేపు సాయంత్రం 6గంటలకు విడుదలకానుంది. టీజర్ లాగే ట్రైలర్ కూడా పూర్తిగా హాస్యభరితంగా ఉండనుందట. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో వెంకీ సరసన తమన్నా అలాగే వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ‘ఎన్టీఆర్ కథానాయకుడు , వినయ విధేయ రామ , పేట’ చిత్రాల రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది మరి ఈ పోటీని తట్టుకొని ఈ చిత్రం విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More