యూఎస్ఏ లో సత్తా చాటుతున్న ఎఫ్ 2 !

యూఎస్ఏ లో సత్తా చాటుతున్న ఎఫ్ 2 !

Published on Jan 20, 2019 9:43 AM IST


విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ ఇటీవల విడుదలై ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈచిత్రం ఈ ఏడాది లో మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫిస్ వద్ద సత్తా చాటుతుంది. శనివారం ఈ చిత్రం అక్కడ 2లక్షల 5 డాలర్ల వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి రికార్డు ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు యూఎస్ఏ లో ఈ చిత్రం 1.5 మిల్లియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతూ చాలా ఏరియాల్లో ప్రాఫిట్స్ ను తెచ్చిపెడుతుంది. అలాగే వెంకీ కెరీర్ లోనే హైయెస్ట్ కల్లెక్షన్స్ సాధించిన చిత్రంగా కూడా ఎఫ్ రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంతో దిల్ రాజు సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు