రెండు రోజుల్లోనే మూడు కోట్లు !!

రెండు రోజుల్లోనే మూడు కోట్లు !!

Published on Jan 21, 2019 12:19 PM IST

ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన మూడు తెలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో ‘ఎఫ్2’ ముందు వరుసలో నిలుస్తూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదలైన 6వ రోజు కూడా ‘ఎఫ్ 2’ నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది.

కాగా ‘ఎఫ్ 2’ శనివరం గానూ నైజాంలో 1.41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఆదివారం నాడు 1.77 కోట్లు వసూలు చేసింది. ఇలా
రెండు రోజుల్లోనే మూడు కోట్లు రాబట్టింది. ఇప్పటికే 40 కోట్ల మార్క్ ను దాటిన ఎఫ్ 2 మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

అలాగే ‘వినయ విధేయ రామ’ విషయానికి వస్తే శనిఆదివారాల్లో కూడా నైజాంలో పెద్దగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. శనివరం గానూ నైజాంలో పది లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఆదివారం నాడు 16 లక్షలను మాత్రమే వసూలు చేసింది. రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ లాంటి ఎందరో పేరున్న నటీనటులు నటించన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య విడుదలై ఆ అంచనాలను అందుకోలేకపోయింది.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా డిసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ సూపర్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు