తెలుగు రాష్ట్రాల్లో “ఎఫ్ 3” రెండు రోజుల వసూళ్ల వివరాలు ఇవే.!

Published on May 29, 2022 12:00 pm IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 3”. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గత ఎఫ్ 2 కి మించి మంచి రెస్పాన్స్ తో అదరగొడుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లనే మొదటి రోజు అందుకోగా రెండో రోజు కూడా ఇదే హవాని చూపినట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రెండు రోజులు వసూళ్లకు సంబంధించి ఏరియాల వారీగా వివరాలు తెలుస్తున్నాయి. ఒకసారి రెండో రోజు వివరాలు చూసినట్టు అయితే..

నైజాం – 4.1 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.05 కోట్లు
సీడెడ్ 1.15 కోట్లు
గుంటూరు – 54 లక్షలు
నెల్లూరు – 24 లక్షలు
కృష్ణ – 51 లక్షలు
వెస్ట్ గోదావరి – 29 లక్షలు
తూర్పు గోదావరి – 52 లక్షలు

ఇక 2వ రోజు మొత్తం ఏపీ తెలంగాణలో షేర్ చూసినట్టు అయితే 8.4 కోట్లు వసూలు కాగా మొత్తం రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 18.77 కోట్లు షేర్ ఐ రాబట్టి స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక ఈ ఆదివారం కూడా మంచి నెంబర్ సెట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :