ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఎన్టీఆర్ సినిమా !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుని ఈ మే నెల ఆరంభంలో రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథగా ఉంటుందట.

ఈ కథలో ఫ్యాక్షన్ లీడర్లుగా జగపతిబాబు, నాగబాబులు కనిపిస్తారని, రాయలసీమ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని కూడ తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసి’ పరాజయంతో నిరాశ చెందిన త్రివిక్రమ్ ఈ సినిమాతో తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ అక్టోబర్ నెలకు సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Exit mobile version