‘పుష్ప’ కోసం అతనికి భారీ రెమ్యునరేషన్ చెల్లించారట

Published on Mar 22, 2021 6:09 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో ఉండేలా చూస్తున్నారు నిర్మాతలు. అన్ని అంశాల్లోనూ ప్రేక్షకుల అంచనాలను మించేలా చిత్రం ఉండేలా చేస్తున్నారు. అందుకోసమే ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ను తీసుకొచ్చారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచి ఒక్కసారి రివీల్ చేశారు. ఈ ప్రకటనతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. మలయాళంలో చిత్రం మీద క్రేజ్ రెట్టింపైంది.

అటు అల్లు అర్జున్, ఇటు ఫహాద్ ఫాజిల్ ఇద్దరినీ ఒకే ఫ్రేములో ఊహించుకుంటే వేరే లెవల్లో ఉందని, ఫహాద్ ఫాజిల్ ను తీసుకోవడమనేది సూపర్ ఛాయిస్ అని అంటున్నారు ఆడియన్స్. ఇంతకీ ఆయన్ను తీసుకోవడానికి మైత్రీ నిర్మాతలు ఎంత వెచ్చించారో తెలుసా.. అక్షరాలా 5 కోట్ల రూపాయలట. దీన్నిబట్టి సినిమా మీద నిర్మాతలు ఏ స్థాయిలో డబ్బు ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తికాగా త్వరలో మూడవ షెడ్యూల్ మొదలుకానుంది. ఆగష్టు 13న ఈ సినిమా భారీ ఎత్తున పలు భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :