“పుష్ప” పై ఫహద్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడట.!

Published on Jul 15, 2021 5:00 pm IST


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో ప్రముఖ మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తాను ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించనున్నాడు.

అయితే తాను నటించిన లేటెస్ట్ చిత్రం “మాలిక్” సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప సినిమా కోసం మరియు దర్శకుడు సుకుమార్ పై చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బయటకి వచ్చాయి. తాను సుకుమార్ సినిమాలు ఎప్పటి నుంచో చూస్తూ వచ్చానని అప్పటి నుంచి కూడా వర్క్ చెయ్యాలి అనుకున్నానని కానీ ఇప్పుడు అది నెరవేరుతుంది అని తెలిపాడు.

అలాగే పుష్ప విషయంలో తన రోల్ పై కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నన్ని త్వరలోనే ఆ షూట్ లో పాల్గొననున్నాని కూడా ఫహద్ తెలిపాడు. ఫహద్ నటన కోసం మూవీ లవర్స్ కి బాగా తెలుసు. మరి ఈ చిత్రంలో ఎలాంటి నటనను కనబరుస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :