“పుష్ప” కోసం కసరత్తులు చేస్తున్న ఫహద్.!

Published on Jun 4, 2021 8:59 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు పార్టులుగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసిన ఈ చిత్రంపై అంతకంతకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మరి పాన్ ఇండియన్ లెవెల్ కు తగ్గట్టుగా సాలిడ్ క్యాస్టింగ్ తో సుకుమార్ రెండు చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.

అలా ఈ చిత్రంలోకి ఆహ్వానించిన మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. అతని నటన కోసం మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ నటుడు ఇపుడు తెలుగులో నటించడం మొదటి సారి కనుక తన మొదటి అటెంప్ట్ నాచురల్ గానే ఉండాలని కసరత్తులు మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది.

అందుకే ఇప్పుడు దొరికిన ఖాళీ సమయంలో తెలుగు భాషపై ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పబోయే చిత్తూరు యాసపై పట్టు సాధించాలని ట్రైన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి కొన్ని రోజులు కితమే అతని పాత్రకి తరుణ్ డబ్ చెబుతున్నాడని రూమర్స్ రాగా అవి కల్పితం అని తేలిపోయింది. మరి ఫహద్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :