స్టార్ హీరో కుమారుడు, కుమార్తెల పేర్ల మీద ఫేక్ అకౌంట్స్

Published on Jun 16, 2021 12:02 am IST

స్టార్ హీరో హీరోయిన్ల పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అవడం, ఫ్యాన్స్ పొరపాటున అవే నిజమైన అకౌంట్స్ అనుకుని వాటిని ఫాలో అవ్వడం తరచూ జరుగుతూనే ఉంటాయి. హీరోలే వాటిని గుర్తించి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడీ ఫేక్ అకౌంట్స్ బెడద స్టార్ల పిల్లల్ని కూడ వదలట్లేదు. తమిళ స్టార్ హీరో విజయ్ కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఒక్క ట్వీట్ చేసినా, ఫోటో వదిలిన విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఫాలోయింగ్ కారణంగానే విజయ్ పిల్లల పేర్ల మీద ఎవరో ట్విట్టర్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు.

విజయ్ కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషాల పేరుతో ట్విట్టర్లో అకౌంట్స్ కనబడగానే ఎగ్జైట్ అయిన ఫ్యాన్స్ వాటిని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఇది గమనించి విజయ్ పీఆర్ టీమ్ వెంటనే స్పందించి అసలు విజయ్ కుమారుడు, కుమారైల పేర్ల మీద ఎలాంటి ట్విట్టర్ ఖాతాలు లేవని, అసలు వాళ్ళు సోషల్ మీడియాలోనే లేరని, వారి పేరు మీద ఏదైనా అకౌంట్ కనిపిస్తే అది ఫేక్ అకౌంట్ అని, వాటిని ఫాలో అవ్వొద్దని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో ఒక మల్టీస్టారర్ చిత్రానికి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :