‘ఫలక్ నుమా దాస్’ రెండు రోజుల కలెక్షన్స్ !

Published on Jun 2, 2019 9:50 am IST

విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా – హీరోగా, కరాటీ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రం ‘ఫలక్ నుమా దాస్’. హర్షిత గౌర్, సలోని మిశ్రా హీరోయిన్స్ గా నటించగా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. కాగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో గత శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం.. నైజాంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.

శుక్రవారం నాడు ‘ఫలక్ నుమా దాస్’ నైజాంలో ప్రీమియర్ షోలను కూడా కలుపుకుని మొత్తం 75 లక్షల షేర్ ను రాబట్టింది. ఆలాగే శనివారం నాడు ఈ చిత్రం 48 లక్షల షేర్ ను సాధించింది. నైజాంలో మొత్తం రెండు రోజులుకుగానూ ‘ఫలక్ నుమా దాస్’ 1.23 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా నైజాంలో ఈ చిత్రానికి ఆదరణ బాగానే ఉంది. పక్కా హైదరాబాద్ నేపథ్యంలో తెరెకెక్కిన ‘ఫలక్ నుమా దాస్’ నైజాం జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :

More