లవ్ & ఫ్యామిలీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచే ‘షేర్’

లవ్ & ఫ్యామిలీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచే ‘షేర్’

Published on Oct 28, 2015 5:48 PM IST

sher
దాదాపు 10 ఏళ్ళ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా రూపంలో ఓ బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పర్ఫెక్ట్ గా తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలని ఎంచుకుంటున్న కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్నా మరో సినిమా ‘షేర్’. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వారం అనగా అక్టోబర్ 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తనకు నచ్చితే ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దపడే యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ నుంచి ఆశించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూనే కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి, లవ్ స్టొరీకి పెద్ద పీట వేసారని సమాచారం. కుటుంబ నేపధ్యంలో వచ్చే సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉంటే, బ్రహ్మానందం – ఎంఎస్ నారాయణ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట.. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి మల్లికార్జున్ డైరెక్టర్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మించాడు.

తాజా వార్తలు