తెలుగులో దేవి శ్రీ ప్రసాద్, తమన్ తరువాత వరుస సినిమా లతో దూసుకుపోతున్నాడు మళయాళీ సంగీత దర్శకుడు గోపిసుందర్. అయితే గత రెండు సినిమాలు ‘పంతం , తేజు ఐ లవ్ యు’ చిత్రాలు ఆడియో పరంగా నిరాశనే మిగిల్చాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న’గీత గోవిందం’ చిత్రం తో మళ్లీ తన సత్తా చాటాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్.
ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం’ కావాలి అనే పాట ఇటివల విడుదలై సుమారు 2కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సాధించి పెద్ద హిట్టు గా నిలిచింది. దీనిపై గోపి సుందర్ స్పందిస్తూ ‘నిన్ను కోరి’ చిత్రంలోని ‘అడిగా అడిగా ‘సాంగ్ తరువాత మళ్లీ అంత పెద్ద హిట్ గా నిలిచింది ఈ సాంగ్. ఈ చిత్రంలో మొత్తం 5 పాటలు ఉంటాయి. అన్ని సూపర్ గా వచ్చాయి. సినిమాకూడా చాలా బాగుంటుందని ఆయన అన్నారు.
ఇక ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదగా ‘గీత గోవిందం ‘చిత్రంయొక్క ఆడియో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది.


