ప్రముఖ నిర్మాత చేతికి ప్రభుదేవా చిత్రం!

Published on Jul 20, 2018 5:00 pm IST

ప్రముఖ దర్శకుడు , నటుడు ప్రభుదేవా, దిత్య బందే ప్రధాన పాత్రల్లో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మి’. డాన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదలచేయనున్నారు. సామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, కరుణాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

గత కొంత కాలంగా తమిళంలో విజయం సాధించిన చిన్న చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్న ఆయన ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది . ఇటీవల సి కళ్యాణ్ ,వి వి వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తో ‘ఇంటెలిజెంట్ ‘అనే చిత్రాన్ని నిర్మించి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక ఈ చిత్రం తరువాత బాలకృష్ణ ,వి వి వినాయక్ కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. కాని ఆ చిత్రం ఫై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

సంబంధిత సమాచారం :

X
More