‘గూఢచారి’ని దక్కించుకున్న ప్రముఖ నిర్మాత !

‘గూఢచారి’ని దక్కించుకున్న ప్రముఖ నిర్మాత !

Published on Jul 18, 2018 12:39 AM IST

అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క తెరకెక్కిస్తున్న చిత్రం’ గూఢచారి’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతున్న ఈచిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మంచి రేటు కు దక్కించుకున్నారని సమాచారం.

స్పై త్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అంధించిన ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . ఈ చిత్రం ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు