‘అరవింద’ కోసం తన గాత్రాన్ని అందించిన ప్రముఖ గాయకుడు !
Published on Aug 14, 2018 12:41 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టీజర్ రేపు ఉదయం 9గంటలకు విడుదలకానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ టీజర్ కోసం అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారట. ఇక ఈ చిత్ర ఆడియో హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి హైలైట్ కానుందట.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ పాట పాడడం విశేషం. ఇంతకుముందు దేవి శ్రీ ప్రసాద్ నేతృత్వంలో తెలుగులో ఎక్కువ సినిమాల్లో పాడిన ఈ గాయకుడు ఇప్పుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తన గాత్రాన్ని అందించారు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

  • 34
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook