అక్కినేని హీరో సినిమాకి నిర్మాతగా ఫేమస్ రైటర్

అక్కినేని హీరో సినిమాకి నిర్మాతగా ఫేమస్ రైటర్

Published on May 13, 2015 7:00 PM IST

Kona-Venkat3
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా, డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన స్టార్ రైటర్ కోన వెంకట్. ఇప్పటికీ స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ తో పనిచేస్తున్న కోన వెంకట్ అంజలి ప్రధాన పాత్రలో చేసిన ‘గీతాంజలి’ సినిమాతో సహా నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ఆయన గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న త్రిపుర కి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది కాకుండా నిఖిల్ హీరోగా ‘శంకరాభరణం’ సినిమాతో కోన వెంకట్ నిర్మాతగా మారిన సాగతీ మనకు తెలిసిందే.

కానీ తాజాగా ఆయన అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే దోచేయ్ సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని మెప్పించిన నాగ చైతన్య ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు నాగ చైతన్య, తమిళంలో శింబు హీరోలుగా నటిస్తున్న ఈ ద్విభాషా చిత్రం తెలుగు వెర్షన్ కి కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. రైటర్ గా బిజీగా ఉంటూనే కోన వెంకట్ తన ప్రొడక్షన్ లో సినిమాలు చేయడం కూడా వేగవంతం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా మంజిమ మోహన్ నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు