సమంత కట్ అవుట్ పై ఫ్యాన్ ఫన్నీ కామెంట్…!

సమంత కట్ అవుట్ పై ఫ్యాన్ ఫన్నీ కామెంట్…!

Published on Jul 4, 2019 9:31 AM IST

సమంత అక్కినేని ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని రేంజ్ ఫాలోయింగ్ ఆమెకు ఉందనిపిస్తుంది. ఇందుకు సాక్ష్యమే తాజా ఉదంతం .రేపు “ఓ బేబీ” మూవీ విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లోని పాపులర్ ధియేటర్ దగ్గర ఆమె అభిమానులు భారీ కట్ అవుట్ ఒకటి ఏర్పాటు చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. స్టార్ హీరోలకు ఇలాంటి కట్ ఔట్లు,వాటి కి దండలు,పాలాభిషేకాలు అనేవి సాధారమే, కానీ ఒక హీరోయిన్ కి ఇలా చేయడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదైన గౌరవాన్ని సమంత దక్కించుకొంది.

ఐతే ఓ అభిమాని ఈ కట్ అవుట్ పై హాస్యాస్పందంగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా సదరు వ్యక్తి సమంత గారు “మీ ఈ కట్ అవుట్ లోని ఫోటో కి కొంచెం ఎడిటింగ్ లో కండలు జోడించి మామిత్రుడు నడిపే జిమ్ కి ప్రచార చిత్రం గా వాడుకోవాలనుకుంటున్నాడు, అతడు మీ వీరాభిమాని,మా పట్టణంలో జిమ్ నడుపుతున్నాడు” అని కామెంట్ చేశాడు. ఆ ట్వీట్ ని టాగ్ చేసిన సమంత, ఓ బేబీ కండలు పెంచడానికి స్టెరాయిడ్స్ వాడుతుంది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసి సదరు అభిమానిని సర్ప్రైజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు