మహేష్ తో రాజమౌళి మూవీ అదే అయితే…ఆయన లుక్?

Published on May 27, 2020 7:23 am IST

రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ మూవీ ప్రకటన జరిగిన నాటినుండి అసలు వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మొదటి చిత్రం ఏ జోనర్ లో రానుంది? సూపర్ స్టార్ మహేష్ ని దేశం మెచ్చిన డైరెక్టర్ ఎలా చూపించనున్నారు? అనే అనుమానాలు, సందేహాలు పెరిగిపోతున్నాయి. ఐతే రాజమౌళి మహేష్ కోసం ఇంకా కథ ఏమి అనుకోలేదని చెప్పడం గమనార్హం. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఓ కథను సిద్ధం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు.

ఐతే క్యూరియాసిటీ ఆపుకోలేని ఫ్యాన్స్ మాత్రం అప్పుడే రకరకాల ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వాటిని పంచుకోవడమే కాకుండా వైరల్ చేస్తున్నారు. వాటిలో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం ఆ పోస్టర్ లో మహేష్ ని రాముడిగా చూపించారు. ఒక వేళ మహేష్ తో రాజమౌళి రామాయణం చేస్తే, రామునిగా మహేష్ లుక్ ఇలానే ఉంటుంది అని పోస్టర్ క్రియేట్ చేశారు. ఆ పోస్టర్ ఊహే అయినప్పటికీ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.

సంబంధిత సమాచారం :

More