బెల్లంకొండ ‘రాక్షసుడు” మూవీకి ఇంత భారీ ధరా…!

Published on Jun 16, 2019 1:13 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా డెరెక్టర్ తేజా దర్శకత్వంలో వచ్చిన “సీత” మూవీలో ‘రాముడు మంచి బాలుడు’లా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన “రాత్ససన్” మూవీకి తెలుగు అనువాదంగా వస్తున్నతెరకెక్కుతున్న “రాక్షసుడు” మూవీ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జంటగా క్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

ఐతే ఈ మూవీ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ హక్కులను మరియు తెలుగు శాటిలైట్ రైట్స్ ను కలిపి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు 18.5 కోట్ల భారీ మొత్తానికి అమ్మారని సమాచారం. కేవలం తెలుగు శాటిలైట్ రైట్స్ కొరకు 6కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కుల కొరకు 12.5 కోట్లు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్నారట. బెల్లంకొండ మార్కెట్ పరంగా చుస్తే ఇది భారీ మొత్తమనే చెప్పాలి. ప్రముఖ లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమిని ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.ఈ మూవీ, ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోనేరి సత్యనారాయణ నిర్మిస్తుండగా,గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More