నాని సినిమాకు అంత ధర పలికిందా.?

Published on Aug 13, 2020 9:20 am IST

నాచురల్ స్టార్ నాని యాంటీ హీరో రోల్ లో సుధీర్ బాబు మరో హీరోగా వైవిధ్య చిత్రాల దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ “వి”. టీజర్ మరియు ట్రైలర్ లతో అద్భుతమైన బజ్ ను సంతరించున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడో విడుదలకు ప్లాన్ చేసినా అందరికీ తెలిసిన కారణం చేతనే విడుదలకు నోచుకోలేకపోయింది.

అలాగే మరోపక్క ఈ చిత్రానికి ఓటిటి ప్లాట్ ఫామ్ వారి వైపు నుంచి కూడా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ మొదటి నుంచీ ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని స్టిక్ అయ్యి ఉన్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఓటిటి లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ చిత్రానికి మంచి ఫ్యాన్సీ ప్రైసే పలికినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి దగ్గరగా 35 కోట్ల వరకు ఆఫర్ వచ్చిందట.

దానితో పాటుగా రానున్న రోజుల్లో పరిస్థితులను ముందే ఊహించి చిత్ర యూనిట్ అందుకు అంగీకరించారని టాక్. అలాగే ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలుస్తుంది. నివేతా థామస్ మరియు అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More