బన్నీ రాక కోసమే అంతా వెయిటింగ్.!

Published on Mar 9, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫంక్షన్ బన్నీ దర్శనం తన అభిమానులకు కలగలేదు.

ఆ మధ్య “ఆహా”లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసారు కానీ ఆఫ్ లైన్ ఫ్యాన్స్ కు రీచ్ కాలేదు. పైగా ఇప్పుడు మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తుండడంతో బన్నీను ఒక ఫంక్షన్ లో చూడాలని ఫ్యాన్స్ చాలా బ్యాడ్లీ మిస్సవుతున్నారు. కానీ ఇప్పుడు అది యంగ్ హీరో కార్తికేయ సినిమాతో పూర్తి కానుంది.

కార్తికేయ హీరోగా లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటించిన చిత్రం “చావు కబురు చల్లగా” ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఈరోజే హాజరు కానుండడంతో ఆ హంగామా ఇప్పుడు మొదలయ్యింది. ముఖ్యంగా బన్నీ స్పీచ్ కోసం అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బన్నీ ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :