‘భరత్ అనే నేను’ 100 రోజుల వేడుకలను జరుపనున్న అభిమానులు !
Published on Jul 26, 2018 5:49 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య మంత్రి పాత్రలో నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’. హ్యాట్రిక్ విజయాల దర్శకుడు కొరటాల శివ తెరెకెక్కించిన ఈచిత్రం ఏప్రిల్ 20 న విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు వరుస పరాజయాల తరువాత మహేష్ ఈ చిత్రం తో తన సత్తా ఏంటో చూపెట్టాడు. ఇక ఈ సినిమా ఈనెల 28వ తేదీతో 100 రోజులను పూర్తి చేసుకోనుంది.

ఈ సంధర్బంగా అభిమానులు 100 రోజుల వేడుకలను బారి ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తో మహేష్ పాపులారిటీ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని తమిళ , మలయాళ భాషల్లోకి కూడా అనువదించారు. డి వి వి ఎంటర్ టైన్మెంట్ పతాకం ఫై దానయ్య డి వి వి నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కియారా అద్వానీ నటించింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook