కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ తో అభిమానులు నిరాశ చెందారా?

Published on Aug 26, 2021 3:00 am IST

యశ్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా తరహాలో భారీ విజయం సాధించింది. మొదటి పార్ట్ ఇచ్చిన ఉత్సాహం తో రెండవ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి అయింది. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎంతగానో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రకటించడం తో అభిమానులు నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 కేవలం టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ అధీరా పాత్రలో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో టాలీవుడ్ కి చెందిన నటీనటులు కూడా ఉండటం విశేషం.

సంబంధిత సమాచారం :