
‘బాలకృష్ణ సినిమా అంటే ఇదీ’ అని చెప్పడానికి కొన్ని బలమైన విషయాలున్నాయి. అద్భుతమైన భావోద్వేగం, బీభత్సమైన యాక్షన్, బలమైన పంచ్ డైలాగులు కలిసి బాలయ్య మార్క్ సినిమాను నిలబెడుతూ ఉంటాయి. తాజాగా కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లయన్’ సినిమాలోనూ ఈ మూడు అంశాలు ఎక్కడా తగ్గలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రుద్రపాటి రమణారావు నిర్మాణంలో నందమూరి నటసింహం బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టేలు నటించిన సినిమా ‘లయన్’ ఈ నెల 14న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది.
ఈ సినిమాలో ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, సూపర్ డైలాగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
“ఒకడొచ్చి పులీ అంటే కిందా పైనా మూసుకొని కూర్చోవాలి.
నేను చేయి చాచినప్పుడే షేక్‌హ్యాండ్ ఇవ్వు. చనువిచ్చాను కదాని చంకనెక్కాలని చూస్తే.. చుట్టాలు చూడ్డానికి కూడా స్కెలిటేన్ మిగలదు.
గాడ్సే అయినా వయలెంటే.. బోస్ అయినా వయలెంటే..
ఈ లయన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది.. తలకాయ్ పేలిపోద్ది.
ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా. ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా.” ఇలా ట్రైలర్‌లోని డైలాగులే ఈ స్థాయిలో ఉంటే ఇక సినిమాలో ఇంకెన్ని పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య అభిమానులకు మళ్ళీ డైలాగుల పండగే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా!

