ఈ ఏడాది ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఆడియోని శిల్పకళ వేదికలో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ వేడుకలో అందరు నతీన్తతులు సినిమా గురించి, మహేష్ బాబు గురించి మాట్లాడారు. ఈ వేడుకలో మహేష్ బాబు మాత్రం అభిమానులు బాగా ఎమోషనల్ గా ఫీలయ్యేలా మాట్లాడడమే కాకుండా వారికి క్షమాపణ కూడా చెప్పారు.
మహేష్ బాబు మాట్లాడుతూ ‘ దేవీశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొరటాల శివ చెప్పిన దానికంటే చాలా బాగా తీసాడు. కమల్ హాసన్ కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన కుమార్తె శృతితో కలిసి పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు, మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుంటాను. లాస్ట్ టైం నేను మిమ్మల్ని నిరుత్సాహపరిచాను. దాంట్లో నా తప్పు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి. ఈ సారి మాత్రం నా బర్త్ డే కి సూపర్ హిట్ మూవీ ఇస్తున్నానని’ అన్నాడు. ఈ మాటలు అభిమానులను ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేసాయి. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మిర్చి ఫేం కొరటాల శివ దర్శకుడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


