కటౌట్ చూసి షాకైన సమంత

కటౌట్ చూసి షాకైన సమంత

Published on Jul 3, 2019 8:03 PM IST

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. అద్భుతమైన నటనతో పాటు మంచి వ్యక్తిత్వం కలిగిన ఆమెకు అన్ని వర్గాల్లోనూ అభిమానులున్నారు. అందుకే ఆమె సినిమాలకు ఈమధ్య కాలంలో ఆదరణ బాగా పెరిగింది. సినిమాలో ఆమె ఉంటే మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్స్ ఖాయమనే నమ్మకం నిర్మాతల్లో కూడా ఏర్పడింది. అందుకే ఆమె ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ అనే సినిమా నిర్మించారు సురేష్ బాబు.

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన భారీ ఎత్తున విడుదలకానుంది. ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్ ఎంతలా ఉందంటే ఏకంగా హీరోలకు ఏర్పాటు చేసినట్టే సమంతకు కూడా సింగిల్ స్క్రీన్ థియేటరల్ వద్ద భారీ కటౌట్స్ కడుతున్నారు. అలాంటి ఒక కటౌట్ చూసి సమంత సైతం నాకేంటి.. కటౌట్ కట్టడమేమిటి అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు