మహేష్ ఫ్యాన్స్ ఆ విషయం మర్చిపోయారు.

Published on Mar 26, 2020 4:01 pm IST

కరోనా అంత కంతకు ప్రమాదంగా తయారవుతుంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ప్రముఖుల నుండి సామాన్యుల వరకు కరోనా భయం పట్టిపీడిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. జనతా కర్ఫ్యూ కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రేమికులు, స్టార్ హీరో ఫ్యాన్స్ సైతం అటు వైపు దృష్టి మళ్లించడం లేదు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ మొన్నటి వరకు ఆయన కొత్త మూవీ అప్డేట్ కొరకు ఎదురు చూశారు.

సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో త్వరగా సినిమా ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కరోనా సందడిలో ఆయన ఫ్యాన్స్ కొత్త మూవీ ప్రకటన గురించి మర్చిపోయారు. ఇక మహేష్ ఇప్పటికే తన కొత్త చిత్రాన్ని నిర్ణయించుకొని ఉన్నా వెంటనే ప్రారంభించే పరిస్థితి లేని పక్షంలో అప్పుడే ప్రకటించకూడదు అనే భావనలో ఉండి ఉండవచ్చు. ఏదిఏమైనా కరోనా ప్రభావం మహేష్ పై ఒత్తిడి తగ్గించింది.

సంబంధిత సమాచారం :

X
More