మహేష్ బాబు అభిమానులకు లక్కీ ఛాన్స్..!

మహేష్ బాబు అభిమానులకు లక్కీ ఛాన్స్..!

Published on Aug 8, 2014 10:35 AM IST

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు లక్కీ ఛాన్స్ ఇది. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆగడు’ సెకండ్ టీజర్ ఆగస్ట్ 9న,మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అవుతుంది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా రేపటి నుండి మొదలుపెడుతున్నారు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు. ‘ఆగడు’ ప్రమోషన్ కార్యక్రమాలలో అభిమానులను కూడా భాగస్వామ్యులను చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆసక్తి కలవారు తమ వివరాలను aagadu.14reels.net మెయిల్ పంపగలరు.

మహేష్ బాబు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. శృతి హాసన్ ప్రత్యేక గీతంలో నటించింది. తమన్ సంగీతం అందించారు. ‘దూకుడు’ వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా రూపొందిస్తున్నామని నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట తెలిపారు. త్వరలో సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు. సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తాజా వార్తలు