మహేష్ ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయిన అభిమానులు !

ఎప్పుడూ అభిమానులకు మొదటి ప్రాముఖ్యత ఇచ్చే హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ఒకరు. అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అభిమానుల్ని కలిసే అయన ఈసారి ఏకంగా 4200 మంది అభిమానుల్ని కలుసుకున్నారు. అది కూడ సెట్స్ లో కావడం విశేషం.

ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ షూటింగ్ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ పిఆర్ టీమ్, అభిమాన సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుండి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. మహేష్ దగ్గరుండి అభిమానులందరినీ కలిసి అందరితో ఫోటోలు దిగి, వారికి మంచి ఆతిథ్యం కూడ అందించారు. మహేష్ ఆదరణ చూసిన ఫ్యాన్స్ ఎంతగానో పొంగిపోయారు.