మణిరత్నం.. తన మ్యాజిక్ సినిమాలతో దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మాస్టర్ ఫిల్మ్‌మేకర్. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘ఓకే బంగారం’ (ఓకే కన్మణి). ఈమధ్యే విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ సినిమా తర్వాత ఆయన కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఆయన ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో రెగ్యులర్ చెకప్ చేయించుకున్నారు.
కాగా ఆయన కేవలం ఓ రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళితే.. ఆయనకు గుండెపోటు వచ్చిందని మీడియా ప్రచారం చేసిందని మణిరత్నం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న మాల మణియన్ తెలియజేశారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తెలిపారు. గతంలో మణిరత్నంకు రెండు సార్లు గుండెపోటు రావడంతో ఈ ఘటన పట్ల అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


