చిరుకు రక్షణగా నిలబడతామంటున్న అభిమానులు

Published on Feb 28, 2020 9:00 am IST


మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్ని వదిలి పూర్తిస్థాయిలో సినిమాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి రాజకీయ వ్యవహారాల్లోనూ లేరు. కానీ కొందరు మాత్రం ఆయనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ జె.ఏ.సి పేరుతో కొందరు చిరు రాజధానిగా అమరావతికే సపోర్ట్ చేయాలని, మూడు రాజధానుల్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రేపు 29వ తేదీన హైదరాబాద్లోని చిరు ఇంటి ముందు శాంతియుత నిరాహారదీక్ష చేస్తామని పిలిపునిచ్చారు.

దీనిపై చిరు అభిమానులు మండిపడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిని మళ్లీ కావాలనే వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని, అప్పట్లో అమరావతి కోసం భూములు తీసుకున్న నాయకుల్ని, ఇప్పుడు రాజధానిని తరలిస్తున్న వారిని ప్రస్నించాలి కానీ ఎలాంటి సంబంధం లేని చిరు ఇంటి ముందు నిరసన ఎందుకని ప్రశ్నిస్తూ చిరుపై జరుగుతున్న కుట్రను తిప్పికొడతామని, రేపు 29న ఆయన ఇంటి ముందు రక్షణగా నిలబడతామని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More