పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ హిట్ సినిమా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిపాడు. ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేయడం పవన్ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని స్టార్ట్ చేయడం ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
అయితే ఈ సినిమాకి థమన్ అందించిన సంగీతం మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ అయ్యిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 కి ఇలా ఉంటే పార్ట్ 2 కి ఇంకో లెవెల్లో ఉంటుంది అని థమన్ ఎప్పుడో ప్రామిస్ చేసాడు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే వచ్చిన కొత్త వీడియోలో తన స్కోర్ విని ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోయారు.
దెబ్బతో మరోసారి కొణిదెల థమన్ అనిపించుకున్నాడు అని కూడా అంటున్నారు. పూర్తిగా వైవిధ్యంగా తన స్కోర్ అదే విధంగా వినేందుకు కేజ్రీగా ఉండడంతో హైప్ డబుల్ అయ్యింది. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ సినిమాకి థమన్ వర్క్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.


