మహేష్ నోట ఆ మాట వినాలని అభిమానుల తహతహ

Published on Jun 26, 2019 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ పనులు మొదలయ్యాయి. సినిమా రెగ్యులర్ షూట్ జూలై 5వ తేదీ ఉంది మొదలుకానుంది. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి వివరంగా మాట్లాడటం జరిగింది కానీ మహేష్ మాట్లాడలేదు. సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసే సమయానికి మహేష్ కుటుంబంతో కలిసి విదేశీ యాత్రలో ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడటం కుదరలేదు.

కానీ ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఈ నెల 28న జరగనున్న ‘మహర్షి’ అర్థ దినోత్సవ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకలో అయినా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి వివరంగా మాట్లాడి సినిమా ఎలా ఉండబోతుందో చిబితే వినాలని అభిమానులు తహతహలాడుతున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజుతో పాటు అనిల్ సుంకర కూడా భాగస్వామిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More