ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్ కి వెల్లువెత్తిన విషెస్!

Published on Mar 12, 2023 8:30 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఒరిజినల్ స్కోర్ విభాగం లో ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ఆస్కార్ అవార్డు తో భారత్ కి తిరిగి రావాలని భారతీయులు అంతా విషెస్ తెలుపుతున్నారు. ఇంకా ఈ వేడుక కి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండటం తో సోషల్ మీడియాలో అభిమానులు విష్ చేస్తున్నారు.

సినిమాలోని నాటు నాటు పాట లైవ్ పెర్ఫార్మెన్స్ ఉండనుంది. ఫ్యాన్స్ ఈ మూమెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :