యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఇటీవల బోనాల వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో ఏర్పడిన వివాదంపై మరోసారి స్పందించింది. తన లేటెస్ట్ చిత్రం ‘సిగ్మా’ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆమె, తన పోస్ట్‌పై వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది.
ఈ వివాదం సమయంలో సమాజంలో ఇప్పటికీ ఉన్న కొన్ని సనాతన భావజాలాన్ని చూశానని, 2026లో కూడా ఇలాంటి ఆలోచనలు ఇంకా కొనసాగడం ఏంటని ఆమె ప్రశ్నించింది. తాను ఎప్పుడూ ముందస్తు ఆలోచనలు కలిగిన వ్యక్తినని ఆమె పేర్కొంది. సోషల్ మీడియా అనేది తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక వేదిక మాత్రమేనని, ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని తాను అర్థం చేసుకోగలనని ఫరియా చెప్పుకొచ్చింది.
వారితో తాను ఏకీభవించకపోవచ్చు కానీ, వారి వేర్వేరు ఆలోచనా విధానాన్ని గౌరవిస్తానని తెలిపింది. ఇకపై ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదని స్పష్టం చేస్తూ, తన ఆలోచన శైలి శాంతి మరియు ప్రేమ మాత్రమేనని తెలిపింది. ప్రస్తుతం ‘సిగ్మా’ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో అందరి దృష్టి ప్రమోషన్స్‌పైనే ఉండాలని ఆమె ఆశించింది.


