విజయ్ పొలిటికల్ ఎంట్రీకి నో అంటున్న ఫాదర్

vijay
సౌత్ ఇండియా లో రాజకీయాలకు – సినిమాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పటికే తెలుగు నటుడిగా ఎంతో కీర్తి గడించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్టార్ హీరోగానే కాకుండా తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీ పెట్టి అది అంతగా సక్సెస్ కాకపోవడంతో ఎం.ఎల్.ఏ, ఎంపిగా సరిపెట్టుకున్నారు.

ఇదే ట్రెండ్ మన పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో కూడా జరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఎంజిఆర్, జయలలిత లాంటి వారు రాజకీయాల్లో ఉన్నారు. తాజాగా స్టార్ హీరో అయిన విజయ్ కూడా తనకున్న క్రేజ్, పాపులారిటీ వల్ల రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టాలని అనుకుంటున్నాడు. కానీ దీనికి విజయ్ నాన్న అయిన చంద్రశేఖర్ మాత్రం పూర్తి విరుద్దంగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినపడుతున్న వార్తల ప్రకారం విజయ్ జనవరిలో ఓ పొలిటికల్ పార్టీని స్థాపించి, బిజెపి తో కలిసి పనిచేద్దాం అని అనుకుంటున్నాడు. కానీ విజయ్ నాన్న చంద్రశేఖర్ మాత్రం విజయ్ ని కనీసం 50 సంవత్సరాల వరకైనా సినిమాల్లో కొనసాగుతూ సినిమాలు చెయ్యమని, ప్రస్తుతం రాజకీయాలు అనేవి ఒక సూసైడ్ లాంటిదని విజయ్ కి చెబుతున్నాడు.

Exit mobile version