దర్శకుడు కాబోయి హీరో అయిన మెగా వారసుడు.

దర్శకుడు కాబోయి హీరో అయిన మెగా వారసుడు.

Published on Mar 4, 2015 5:00 PM IST

varun-tej
‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు ఆరడుగుల అందగాడు, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్. అతని స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తన కుమారుడిని దర్శకుడిగా చూడాలని నాగబాబు కలలు కన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను అనుసరిస్తూ.. వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో కావడం కోసం ఒకప్పుడు బొద్దుగా ఉండే వరుణ్ తేజ్, 30 కిలోలకు పైగా బరువు తగ్గాడు. స్లిమ్ & స్టైలిష్ లుక్ కోసం చాలా కష్టపడ్డాడు.

‘ముకుంద’ సినిమా ఆశించిన విజయం సాదించకపోయినా.. వరుణ్ తేజ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాలో క్యారెక్టర్ పరిధి మేరకు నటించాను. సీరియస్ గా ఉండే పాత్ర అది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో నా నటనలో ఇతర భావోద్వేగాలను చూపడానికి ఓ అవకాశం దొరికింది. అని తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పేర్కొన్నారు.

తాజా వార్తలు