థియేటర్స్ తెరుచుకునేది అప్పుడేనా..?

Published on May 22, 2020 11:48 am IST

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వెండితెరను చీకటి చేసింది. బంద్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక వందల థియేటర్స్ మూతపడ్డాయి. వీటిపై ప్రత్యేక్షంగా పరోక్షంగా ఆధారపడిన అనేకమంది ఉపాధి కోల్పోయారు. మరలా ఈ థియేటర్స్ ఓపెన్ అయ్యేదెప్పుడు, వీటికి పునర్వైభమ్ ఎప్పుడంటే.. కొంత సమయం పట్టవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. దానికి కారణం దేశంతో పాటు, అన్ని రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంది. కావున ప్రభుత్వాలు రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేవు.

తాజా సమాచారం ప్రకారం థియేటర్స్ కి మోక్షం కలిగేది ఆగస్టులోనే అని తెలుస్తుంది. అప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గవచ్చని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈలోపు ఇండస్ట్రీ పెద్దలు చొరవ తీసుకొని థియేటర్స్ ఓపెన్ చేసినా, ప్రేక్షకులు ఆసక్తి చూపని ఇబ్బంది ఏర్పడవచ్చు. అప్పటి వరకు సినీ ప్రేమికులు తమకు ఇష్టం వచ్చిన సినిమాలు బుల్లితెరపై చూడవలసిందే. ఇక నిన్న టాలీవుడ్ పెద్దలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలువగా, ప్రీ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. రేపు మళ్ళీ చిరు సారథ్యంలో కే సి ఆర్ ని కలవనున్నారు.

సంబంధిత సమాచారం :

More