
సుష్మాదర్శన్ క్రియేషన్స్ పతాకంపై ఫిదా పేరుతో నిర్మాత సత్యనారాయణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అభినయ దర్శన్, మధుమిత, అజిత్ శుక్లా తదితర తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారన్నది ఇప్పటికి సస్పెన్స్! సస్పెన్స్ అంటే దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని కాదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే వ్యక్తి పేరు ఇప్పుడే తెలియజేసే ఆలోచనలో చిత్ర యూనిట్ లేదు. ప్రస్తుతం ప్రతీ సినిమా విషయంలో ప్రేక్షకుడు కొత్తదనం కోరుకుంటున్నాడు.
కేవలం కథా, కథనాల్లోనే కాక సినిమాపై ఆసక్తి కలిగించడానికి ముందు నుంచీ ప్రతీ విషయంలో కొత్తదనం చూపించాలనే ప్రయత్నంలో ఫిదా యూనిట్ దర్శకుడి పేరును సస్పెన్స్‌లో పెట్టింది. ఇక ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిపి సినిమాను లాంచ్ చేశారు. కోట శ్రీనివాసరావు, సప్తగిరి, తాగుబోతు రమేష్, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పి.ఆర్. సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

