పూరి మార్క్ రొమాన్స్ కనిపిస్తుందిగా..!

Published on Mar 1, 2020 9:06 am IST

విజయ్ దేవరకొండ లాంటి రౌడీ హీరో పూరి లాంటి డైనమిక్ డైరెక్టర్ తో చేస్తుండడంతో మూవీపై అంచనాలు తారా స్థాయిలో. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటికి వచ్చాయి. విజయ్ బైక్ పై ఎదురు కూర్చొని రొమాన్స్ చేస్తున్న అనన్యని చూస్తుంటే ఈ సినిమాలో పూరి మార్క్ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందనిపిస్తుంది. పూరి సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఈ చిత్రంలో కూడా ఆ పాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటుందనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా నటిస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి నిర్మిస్తుండగా, కరణ్ జోహార్ మరో నిర్మాతగా ఉన్నారు. హిందీ, తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More