షూటింగ్స్ కోసం కొత్త తీర్మానాలు !

Published on Jun 17, 2021 11:02 pm IST

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. లాక్‌డౌన్‌లో సడలింపులు విధిస్తూ వస్తుంది ప్రభుత్వం. ప్రస్తుత సడలింపులలో కొన్ని నిబంధనలతో షూటింగ్స్‌కి కూడా అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తుండటంతో.. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్‌ని ఏర్పాటు చేశాయి.

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఫిలిం షూటింగ్స్ తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కింది తీర్మానాలు చేశారు. 24 క్రాఫ్ట్స్ సంబంధించి.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే.. షూటింగ్‌లకు అనుమతి ఉంటుందనేలా తీసుకున్న ఈ మీటింగ్‌లోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

త్వరలో తిరిగి షూటింగ్స్‌ ప్రారంభం అవుతున్నందున ఆర్టిస్ట్స్ లు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ షూటింగ్స్ లో పాల్గొని 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరైనను ఆగిపోయి ఉన్న చిత్రాలను పూర్తి చేయవలసిందిగా నిర్ణయించడమైనది. ఆ బ్యాలెన్స్‌ వర్క్ పూర్తి అయిన తదుపరి మాత్రమే కొత్త సినిమాలు చేయుటకు నిర్ణయించడమైనది.

దర్శకులు దానికి సంబంధించిన అన్ని విభాగాల వారు కరోనా వలన ఆగిపోయి ఉన్న చిత్రాలకు షెడ్యూల్స్ ని కుదించుకుని తక్కువ రోజులలో నిర్మాణం పూర్తి చేయవలసిందిగా నిర్ణయించడమైనది. షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్‌ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించడం అయినది.

షూటింగ్స్ కు హాజరయ్యే ప్రతి యూనియన్ సభ్యుడు ఒక డోస్ వ్యాక్సినేషన్ కచ్చితంగా తీసుకొని ఉండవలెనని అలా తీసుకొన్న సభ్యులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యే విధంగా ఉండాలని, ఆ ప్రకారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారికి ఒక లేఖ వ్రాయుటకు నిర్ణయించడమైనది.

ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు (శోఫ్స్) విధిగా పాటించవలసినదిగా నిర్ణయించడం అయినది. ఈ సూచనలు అన్నిటిని ప్రొడక్షన్ హౌస్ మేనేజర్స్, ఆర్టిస్ట్ మేనేజర్స్ కి తెలియ చేస్తూ వారు ఆయా టెక్నీషియన్ కు ఆయా ఆర్టిస్ట్ లకు తెలియ చేయవలసిన బాధ్యత వారిదే అని తీర్మానించడమైనది. అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ వ్యక్తిగతంగాను, వ్యవస్థ పరంగానూ అందరు సామాజిక బాధ్యత తో మెలుగుతూ మరియు తగు జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్స్ లలో పాల్గొనాలని కోరడమైనది

అలాగే ఫిలిం ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలని సూచించడం అయినది. పైన తెలియజేసిన తీర్మానాలను తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియచేసినారు. ఈ విషయాలకు సంబంధించి సలహాలు గాని, ఫిర్యాదులు గాని, ఏమైనా ఉన్న యెడల లేదా వీటిని పాటించని యెడల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియజేసిన యెడల, ఆ ప్రకారం వారు తగు చర్యలను తీసుకొని వాటిని అమలు చేయుటకు నిర్ణయించడం అయినది.

సంబంధిత సమాచారం :